‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ వచ్చేసింది.. ఇక పూనకాలే

ఎప్పుడా ఎప్పుడా అని అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు జక్కన్న ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్‌గా చేస్తున్న ఎన్టీఆర్ నటిష్టున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ పాత్రను రామ్ చరణ్ అంటే అల్లూరి సీతారామ రాజు పరిచయం చేస్తున్నట్టు ఈ వీడియోను రూపొందించారు జక్కన్న. `వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.

నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్` అంటూ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌ ఒక రేంజ్ లో అంచనాలు రేపగా అదే సమయానికి ఎన్టీయార్ పులిలా గాండ్రిస్తూ ఉండడం సినిమా మీద అంచనాలు రేపెస్తోంది. ఇక ముస్లిం వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ లుక్ ని ఫ్రీజ్ చేసి ఈరోజు జయంతి సంధర్భంగా ఈ గిఫ్ట్ అని టీమ్ పేర్కొంది.