హమాలి పని కూడా ఉపాధే..మంత్రి నిరంజన్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

నాగర్ కర్నూల్ : వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్నోళ్ళందరికీ సర్కారు నౌకరి రాదని… కొనుగోలు కేంద్రాల వద్ద హమాలి పని ఉపాధి కాదా… అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఎంపీ రాములు అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ… హమాలి పని కంటే… తెలంగాణలో మించిన ఉపాధి ఏముందని వెల్లడించారు మంత్రి నిరంజన్ రెడ్డి.

హమాలీలకు వారి సొంత పనులు చేసుకుంటూనే హమాలీ చేసుకునే వెసులుబాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు.

రాజకీయ లబ్ధి కోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించి ముసలి కన్నీరు కార్చి యువతను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నామని ఆయన విమర్శలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగాలను తొలగించి ప్రైవేటు పరం చేస్తున్న పార్టీలు సైతం ఇక్కడ ఉద్యోగాల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.