అసెంబ్లీ లో నిద్ర పోతున్న మంత్రి పేర్ని నాని.. వీడియో వైరల్

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ఈ సందర్భంగా జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ అసెంబ్లీ వేదికగా స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక అంతకు ముందు.. ఇదే విషయంపై సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును… ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్… అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

అయితే.. ఈ సందర్భంగా ఓ అరుదైన సంఘటన వెలుగు చూసింది. అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతున్న సమయంలో మంత్రి పేర్ని నాని సభలో నిద్రపోయారు. మంత్రి బుగ్గన మాట్లాడుతున్న సమయంలో… మంత్రి పేర్ని నాని కునుకు తీయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన తెలుగు దేశం పార్టీ నాయ కుడు అలాగే సోషల్ మీడియా వారియర్స్ సెటైర్లు పేల్చుతున్నారు. అసెంబ్లీ లో నిద్ర పోవడ మేంటని ఫైర్‌ అవుతున్నారు.