గురుకుల పాఠశాలలకు తాళాలు వేయడం పై మంత్రి పొన్నం సీరియస్..!

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు తాళాలు వేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతోనే గురుకుల పాఠశాలలకు, వసతి గృహాలకు తాళాలు వేస్తున్నారట పలు బిల్డింగ్ యజమానులు. ముఖ్యంగా బెల్లంపల్లి, వరంగల్, తుంగతుర్తి, తాండూరు, భూపాలపల్లి, హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో వసతి గృహాలకు తాళాలు వేసినట్టు సమాచారం. దసరా సెలవులు నిన్నటితో ముగిసిపోవడంతో ఇవాళ విద్యార్థులు, టీచర్లు వచ్చి చూస్తే.. ఇంకా తాళాలే వేసి ఉన్నాయి. దీంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. తాజాగా దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

రాష్ట్రంలో గురుకులాలు 70 శాతం అద్దె భవనాలలోనే ఉన్నాయని.. వాటి బకాయిలను చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ బకాయిలు గత పది నెలల కాలంలో పెట్టినవి కాదని.. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని స్పష్టం చేశారు మంత్రి. వెంటనే గురుకుల స్కూళ్లను తెరవాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల స్కూళ్ల ప్రారంభానికి అడ్డు పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు

Read more RELATED
Recommended to you

Latest news