ఆ ఐదు గ్రామాలతో ఏపీకి ఉపయోగం లేదు : మంత్రి పువ్వాడ

-

భద్రాద్రి రామయ్య మునగకుండా ఉండాలంటే ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు అప్పగించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. ఆ గ్రామాలతో ఏపీకి ఉపయోగం లేదని తెలిపారు. కనీసం అక్కడ సహాయ చర్యలు కూడా చేపట్టే అవకాశం కూడా వారికి లేదని అన్నారు. తెలంగాణకు అప్పగిస్తే కరకట్టలు నిర్మించడానికి వీలవుతుందని చెప్పారు.

శాసనమండలిలో పువ్వాడ మాట్లాడారు. పోలవరం ముంపుపై సమగ్ర అధ్యయనం జరగలేదని, 90 అడుగుల మేరకు వరద వచ్చినా మునగకుండా కాంటూరు స్థాయులను చూసి బాధితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అజయ్‌ పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంతో వరద వేగం తగ్గిపోయిందని.. ఈ ప్రాజెక్టు పూర్తయితే భద్రాద్రి వద్ద 50… 60 అడుగుల మట్టం ఉంటుందని వెల్లడించారు. వరదలపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news