తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో నో డీజల్ బోర్డులు… గత రెండు రోజులుగా వెలిశాయి. దీంతో రెండు రోజులుగా డీజల్ దొరక్క అవస్థలు పడుతున్నారు వాహనదారులు. నేడు పలు బంకుల్లో పెట్రోలు సైతం కొరత అంటూ బోర్డులు పెట్టాయి పెట్రోల్ బంకులు. నగరంలో తోంబైశాతం బంకుల్లో దర్శినమిస్తున్నాయి నో స్టాక్ బోర్డు లు.
డీజల్ లభించక లారీలు, ట్రక్కుల, వ్యాన్‌లు, జీపులు, కార్ల యజమానులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత కొద్ది రోజులుగా చమురు సంస్థలు డీలర్లు నిర్వహించే పెట్రోలు బంకులకు తక్కువ పరిమాణంలో డీజిల్ సరఫరా చేయడంతో ఈ కొరత ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరుగుతుండటంతో పాత ధరకే డీజిల్ సరఫరా చేస్తే తమకు నష్టాలు వస్తాయని భావించే హిందూస్థాన్ పెట్రోలియం నగరానికి తక్కువగా డీజిల్‌ను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.