ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్య కళాశాలల నిర్మాణం: మంత్రి రజిని

-

రాష్ట్రంలో 5 వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామని మంత్రి విడదల రజిని తెలిపారు. పరిమిత ఫీజులతో వైద్య కళాశాలలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరగదని.. వైద్య కళాశాలల నిర్వహణ ప్రభుత్వానికి ఆర్థిక భారం కాదని మంత్రి పేర్కొన్నారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘మెడికల్ కాలేజీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తితో నడిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరిమిత ఫీజులతో మెడికల్ కాలేజీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు మెడికల్ సీట్లు కోసం ఇతర దేశాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు ద్వారా స్థానికంగా విద్యార్థులకు మేలు జరుగుతుంది.

vidadala rajini: బాధితురాలికి అండగా ఉంటాం: మంత్రి విడదల రజిని vidadala rajini responds on repalle railway station rape incident

మెడికల్ కాలేజీల వల్ల ప్రభుత్వానికి.. కాలేజీ నిర్వహణకు ఆర్థిక భారం కాబోదు. జనరల్ కేటగిరీ రూ.15 వేలు, బీ కేటగిరీ రూ.12 లక్షలు, ఎన్‌ఆర్ఐ సీట్లకు రూ.20 లక్షలు చొప్పున ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. జగనన్న సురక్ష ద్వారా జరిగే మేలు ప్రజల ముఖాల్లో సంతోషం తెచ్చింది. నేను నా నియోజక వర్గం వెళ్లినప్పుడు సురక్ష కార్యక్రమం గురించి ప్రజలు గొప్ప చెప్పుకుంటున్నారు.’’ అని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news