మీ డాడీ కేడీ కాబట్టే అరెస్టయ్యాడు : మంత్రి రోజా

-

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో సీఎం జగన్‌పై వ్యాఖ్యలు చేశారు. “పిచ్చోడు లండన్‌కి.. మంచోడు జైలుకి.. ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు.. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వేయడం సాధ్యం కాదు సైకో జగన్..” అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ కామెంట్స్‌కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని, అవినీతికి పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపించకుండా ఎక్కడకు పంపిస్తారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందన్నారు.

RK Roja slams Nara Lokesh over allegations on industrial development

సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రోజా కౌంటర్ ఇచ్చారు. ఓ పిల్ల సైకో లోకేశ్… మీ డాడీ కేడీ కాబట్టే అరెస్టయ్యాడని విమర్శలు గుప్పించారు. మీ నాన్న మంచోడు కాదని, సూట్ కేసు కంపెనీలతో ముంచేసినోడని తెలుసుకో అన్నారు. ఇలాంటి కరప్షన్ కింగ్‌ను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా? అని ఎద్దేవా చేశారు. ఓ పప్పూ.. మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే కనుక ఈ కుంభకోణంలో విచారణ జరుపుకోండని ధైర్యంగా చెప్పు అంటూ లోకేశ్‌కు సవాల్ చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబును ఏ దేవుడూ కాపాడలేడని, మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికి సంతోషిస్తుందన్నారు. బైబై తుప్పు.. బైబై పప్పు అంటూ ట్వీట్‌ను ముగించారు.

Read more RELATED
Recommended to you

Latest news