టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిపై మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఎటాక్ దిగారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు వంటి పేద ప్రజల కోసం.. వారి సంక్షేమం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచించారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో దోరికిపోయి జైల్లో కూర్చుంటే సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య, ఆయన కోడలు గంట కొట్టండి, విజిల్స్ వేసి సీఎం జగన్ కు బుద్ది చెప్పండీ అంటున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా బ్రాహ్మణి తెలియక మాట్లాడుతోందో.. తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారా అనేది అర్థం కావాడం లేదని మంత్రి రోజా అన్నారు.
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవమున్న నేతగా చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే.. ఆయన మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపెడతామంటూ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడి, షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్లు ప్రజాధనం స్వాహా చేశారని ఫైర్ అయ్యారు. ఆ స్కామ్‌లో అన్ని ఆధారాలతో దొంగలా దొరికి జైల్లో కూర్చొంటే, ఈరోజు ఆయన భార్య,కోడలు బ్రాహ్మణి సిగ్గులేకుండా.. ప్రజలంతా గంటకొట్టి తమకు సంఘీభావం తెలపండని కోరతారా..? అని నిలదీశారు. తప్పుచేసి, సాక్ష్యాధారాలతో సహా దొరికి జైలుకి పోయిన తర్వాత కూడా చంద్రబాబు కుటుంబం ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటం చాలా సిగ్గుచేటు అని అన్నారు. మరోసారి సీఎం జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడినా.. ట్వీట్‌లు పెట్టినా నారా బ్రాహ్మణికి మర్యాద దక్కదని హెచ్చరించారు. మీరు ఇలాగే నీచమైన మాటలతో ప్రజల్ని అమాయకుల్ని చేయాలనుకుంటే మిమ్మల్ని హైదరాబాద్‌కే పరిమితం చేసేలా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు తరిమికొట్టి తగిన బుద్ధిచెబుతారని అన్నారు.