మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ, జేఎన్‌టీయూ విద్యార్థులు మంత్రి ఇంటిని ముట్టడించారు. సత్యసాయి నిగమాగమం నుంచి సబితా ఇంటి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు కనీసం ఆన్ లైన్‌లోనైనా నిర్వహించాలని కోరుతున్నారు. విద్యార్థులకు టీకాలు వేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

దీంతో ఆమె ధర్నా చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు కోరిన చోట పరీక్షలు రాసే అవకాశం కల్పించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించాకే పరీక్షలు నిర్హహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.