నిరుద్యోగులకు శుభవార్త.. మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1388 ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

మజగాన్ డాక్/MDL
మజగాన్ డాక్/MDL

మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం దీనిలో 1388 పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. ఆ తర్వాత మరో రెండేళ్లు కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.

అర్హులైన అభ్యర్థుల జాబితా 2021 జూలై 15న విడుదలవుతుంది. అనర్హతకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి 2021 జూలై 22 చివరి తేదీ. ఇది ఇలా ఉంటే ఆన్‌లైన్ ఎగ్జామ్ 2021 జూలైలో ఉంటుంది. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్- 5, కంప్రెషర్ అటెండెంట్- 5, కార్పెంటర్- 81, చిప్పర్ గ్రైండర్- 13, కంపోజిట్ వెల్డర్స్- 132, డీజిల్ క్రేన్ ఆపరేటర్- 5, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్- 4, జూనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 52, జూనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్)- 2, ఎలక్ట్రీషియన్- 204.

ఎలక్ట్రానిక్ మెకానిక్- 55, ఫిట్టర్- 119, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (మెకానికల్)- 13 పోస్టులు వున్నాయి. అదే విధంగా గ్యాస్ కట్టర్- 38, మెషినిస్ట్- 28, మిల్‌రైట్ మెకానిక్- 10, పెయింటర్- 100, పైప్ ఫిట్టర్- 140, రిగ్గర్- 88, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్- 125, స్టోర్ కీపర్- 10, యుటిలిటీ హ్యాండ్- 14.

ప్లానర్ ఎస్టిమేటర్ (మెకానికల్)- 4, ప్లానర్ ఎస్టిమేటర్ (ఎలక్ట్రికల్)- 4, పారామెడిక్స్- 2, సెమీస్కిల్ట్ యుటిలిటీ హ్యాండ్- 135 పోస్టులు భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mazagondock.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 38 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100.

 

 

Read more RELATED
Recommended to you

Latest news