ఎమ్మెల్యే హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

-

పింఛన్ల పెంపులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలన్న మాజీ మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ వేశారు.హరీశ్ రావు చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థమవుతుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాము తెలంగాణ ప్రజలు ఆలోచనలను అమలు చేస్తాం కానీ.. ఆంధ్ర ప్రదేశ్ ఆలోచనలు కాదన్నారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని వెల్లడించారు.

12 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పరీక్షను తామే నిర్వహించామని ,త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదన్నారు. వాళ్ల హయాంలో ఆశా వర్కర్స్ ను గుర్రాల తో తొక్కించారని ఆయన ఆరోపించారు .త్వరలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news