జులై 01 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి.. కేంద్ర మంత్రి అర్జున్ రాయ్ మేఘ్వాల్ కీలక ప్రకటన

-

నెల 01 నుంచి దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. వాటి అమలుకు అవసరమైన శిక్షణ ఇప్పటికే జరుగుతోందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ‘ఇండియా ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ప్రసంగించారు. ‘జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే చట్టాలు..ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ల స్థానంలో అమల్లోకి వస్తాయి’ అని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, జ్యుడీషియల్ అకాడమీలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు దీని కోసం శిక్షణను అందిస్తున్నట్టు చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)పై స్పందిస్తూ.. బీజేపీ మేనిఫెస్టోలోనే ఈ అంశాన్ని ప్రస్తావించామని, దీనిని తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. గోవా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికూ యూసీసీ అమలు చేయడం ప్రారంభించాయని గుర్తు చేశారు. కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణం చాలా బలమైందని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news