రైతు భరోసా అమలుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

-

గోదావరి నదిలో వరద లేదని, కానీ ప్రాణహిత లో వరద ఎక్కువగా వస్తున్నదని దీంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.బుధవారం శాసన మండలిలో మాట్లాడుతూ..గత ప్రభుత్వం బ్యారేజ్‌లు సక్రమంగా నిర్మించలేదని, అందుకే వివిధ ప్రాజెక్టులలో నీరు వృథా అవుతుందని అన్నారు.ఇష్టారీతిలో ప్రాజెక్టులకు రీ డిజైన్ లు చేసి, అస్తవ్యస్తంగా మార్చేయడంతో ఇప్పుడు రైతులకు కష్టాలు వస్తున్నాయన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని బ్యారేజ్ లూ సక్రమంగా నిర్మించక పోవడం వలన నీళ్ళు వృథాగా పోతున్నాయని అన్నారు.

రైతు భరోసా అమలు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతు భరోసాపై గైడ్ లైన్స్ ఎలా ఉండాలనేది రెండు సభలలో చర్చిస్తామని వెల్లడించారు.మరోవైపు అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో 26 వేల కోట్లు నిధులు వృథా అయ్యాయని మండిపడ్డారు.ఒక్కో వ్యవస్థను చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news