ఒకే బాలికను మూడు సార్లు గ్యాంగ్ రేప్..

-

ఉత్తర ప్రదేశ్ లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. కాన్పూర్‌ లోని చాకేరిలో మైనర్ బాలికను తన ప్రియుడు మరియు అతని స్నేహితులు కలిసి మూడు సార్లు సామూహిక అత్యాచారం చేశారు. శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది గంటల్లోనే మూడుసార్లు సామూహిక అత్యాచారం చేశారని బాలిక తల్లితండ్రులు ఆరోపించారు. నిందితుల్లో ఇద్దరు రాహుల్ సోంకర్, మిథున్ సోంకర్ అని గుర్తించారు.

ఆ మైనర్ బాలిక ఇంటర్నెట్ ద్వారా సాహిల్‌ అనే వ్యక్తిని కలుసుకుంది. ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. సాహిల్ తన స్నేహితురాలిని త్రిమూర్తి ఆలయం దగ్గరకు తీసుకురావాలని మరో ఇద్దరు స్నేహితులను కోరాడు. ఇద్దరు అబ్బాయిలు మైనర్ బాలికను తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు, సాహిల్ వారితో చేరాడు. అతను వి.కె.రాజపుత్ అనే యువకుడితో కారులో వచ్చి, మత్తు మందు తో కూడిన వస్తువులను ఆమెకు తినేందుకు ఇచ్చాడు. అవి తిన్నాక బాలిక స్పృహ కోల్పోయినప్పుడు, నలుగురు నిందితులు బాలికను ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెని గ్యాంగ్ రేప్ చేశారని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news