తన రాజకీయ ప్రవేశం గురించి ఈరోజు అభిమాన సంఘాలతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయిన సంగతి తెలిసిందే. 38 జిల్లాల కార్యదర్శులతో రజినీకాంత్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఆయన రాజకీయ ఆరంగ్రేటం పై కీలక ప్రకటన చేస్తారని కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో రజినీకాంత్ కు అభిమాన సంఘాలు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
అదేంటంటే ఈ సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అభిమాన సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తున్నట్లు సమాచారం. మీరు పార్టీ పెడితే మీ వెంట నడుస్తానని సంఘాల నేతలు తేల్చి చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ మీరు బీజేపీకి మద్దతు ఇస్తే మేము మీ వెంట నడవలేమని అభిమాన సంఘాల నేతలు పేర్కొన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ అభిమానులను రజినీకాంత్ బుజ్జగిస్తున్నట్లు సమాచారం. మరి ఎట్టకేలకు దీని గురించి ఏమి ప్రకటన వెలువడుతుందో తెలియల్సి ఉంది.