భారత వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. 49 కేజీల విభాగంలో జరిగిన ఒలంపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆమె సిల్వర్ మెడల్‌ను సాధించింది. కాగా ఒలంపిక్ చరిత్రలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొదటి సిల్వర్ మెడల్‌ను సాధించిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.
26 ఏళ్ల మీరాబాయి చాను 87 కిలోల బరువును స్నాచ్ ఈవెంట్‌లో లిఫ్ట్ చేయగా, క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్‌లో 115 కిలోల బరువును ఎత్తింది. ఈ క్రమంలో 49 కిలోల విభాగంలో 202 స్కోరు చేసి ఆమె సిల్వర్ మెడల్‌ను సాధించింది.
కాగా మీరాబాయి చాను మెడల్ సాధించడంతో భారత్ ఈ ఒలంపిక్స్ ఖాతాలో బోణీ చేసింది. ఈ ఒలంపిక్స్‌లో భారత్ సాధించిన తొలి మెడల్ ఇదే కావడం విశేషం. ఇక చైనాకు చెందిన హౌ జిహుయై ఇదే విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించింది. ఇండోనేషియాకు చెందిన క్రీడాకారిణికి బ్రాంజ్ మెడల్ వచ్చింది.
Silver Medal for for #TeamIndia Saikhom Mirabai Chanu Wins India’s First Medal, Settles For Silver In #Weightlifting #Tokyo2020 #Olympics #MirabaiChanu pic.twitter.com/rh4iATzz6t
— Doordarshan Sports (@ddsportschannel) July 24, 2021