టోక్యో ఒలంపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. ఈ ఒలంపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో… రజత పతకం సాధించి రికార్డులను తిరగరాసింది. రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరా భాయ్ చరిత్ర సృష్టించింది.
ఇండియా తరఫున ఒలంపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత రెండవ వెయిట్ లిఫ్టర్ కావడం గమనార్హం. 84, 87 కిలోల విభాగం వెయిట్లిఫ్టింగ్ లో మీరాబాయ్ విజయం సాధించారు. చైనాకు చెందిన హు జీహూ 94 కిలోల బరువు ఎత్తి ఒలంపిక్స్ రికార్డు సృష్టించారు. ఐదేళ్ల క్రితం మీరాభాయి రియో ఒలంపిక్స్ లో పాల్గొని పేలవ ప్రదర్శన ఇచ్చింది. అయితే ఆ తర్వాత పట్టు వదలని విక్రమార్కుడి తరహాలో… టోక్యో ఒలంపిక్స్ లో తొలిసారి రజత పతకం సాధించి.. ఇండియా తరఫున బోణీ కొట్టింది.