ఆ విషయం లో సొంతవాళ్లే జగన్ ని తప్పు దారి పట్టిస్తున్నారు .. !

-

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరిపాలన విషయంలో చాలా అద్భుతమైన రెస్పాన్స్ రాష్ట్ర ప్రజల నుండి అందుకుంటున్నారు. సంక్షేమ మరియు అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా మాట రాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లే విధంగా వాలెంటరీ తీసుకువచ్చి తనకి ప్రజలకు కనెక్షన్ ఉండే విధంగా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంతా బాగానే ఉన్నా గాని ఒక విషయంలో సొంత వాళ్లే వైయస్ జగన్ ని తప్పుదారి పట్టిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే వైయస్ జగన్ తన తండ్రి మాదిరి పరిపాలిస్తున్న గాని ఒక మీడియా విషయంలో తన చుట్టూ ఉన్న మనుషుల మాటలు విని తప్పు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. Image result for ys jagan vs ab venkateswara raoవైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మీడియా విషయంలో స్వ‌యంగా స్టూడియోకు వెళ్లేవారు. ప్రేక్ష‌కుల‌తో నేరుగా మాట్లాడి క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేవాళ్లు. ఇక జ‌గ‌న్ విషయానికొస్తే సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప‌ది నెల‌ల‌కు, అది కూడా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా ప‌డిన నేప‌థ్యంలో మీడియా ముందుకు రావడం జరిగింది. దీంతో మీడియా విషయంలో జగన్ ని చుట్టూ ఉన్న మనుషుల తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని..ఏ మాత్రం రాష్ట్రంలో కొద్దిగా వ్యతిరేకత స్టార్ట్ అయిన సదరు మీడియా చానల్స్ జగన్ ని ఏకి పారేయడం గ్యారెంటీ అని అంటున్నారు చాలామంది.

 

వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు వ్యతిరేకంగా వ్యవహరించే చానల్స్ యొక్క యాజమాన్యాల తోనే విభేదించారే త‌ప్ప‌, జ‌ర్న‌లిస్టుల‌తో కాద‌నే విష‌యాన్ని గుర్తించాలి. కానీ జ‌గ‌న్ మాత్రం య‌జ‌మానుల‌తోనే కాదు జ‌ర్న‌లిస్టులు కూడా విభేదిస్తూ తన మీడియా సమావేశాలకు రానివ్వకుండా ఉండటం తన సర్కార్ కి అతి పెద్ద మైనస్ అవుతుందని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో సొంత వాళ్ళ మాట పక్కన పెట్టి జగన్ ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలు అన్ని చానల్స్ కి చెబితే బాగుంటుందని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news