బాహుబలి స్ఫూర్తితోనే ఆ సినిమాలో నటిస్తున్న అంటున్న మిస్ వరల్డ్..!

మామూలుగా ఎంతో మంది నటులు సినిమాల్లోకి రావడానికి వారికి ఏదో ఒక సినిమా స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసింది. ఇక్కడ ఓ బాలీవుడ్ నటి కి తెలుగు సినిమా స్ఫూర్తిగా నిలిచింది అని చెబుతోంది. ప్రియాంక చోప్రా తర్వాత మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న మానుషి చిల్లర్… ఇటీవలే అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న పృథ్వీరాజ్ సినిమాలో నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో తాను నటించడానికి కారణం టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా అంటూ చెబుతుంది. ప్రస్తుతం పృథ్విరాజ్ సినిమాకి చంద్రప్రకాష్ త్రివేది దర్శకత్వం వహిస్తున్నారు. కాగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా చూసిన తర్వాత భారీ పీరియాడికల్ మూవీ లో నటించాలని కోరిక కలిగిందని… అదే సమయంలో పృద్వి రాజ్ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.