ఐపీఎల్‌లో మరో కీ ఫైట్‌..టాప్‌ ప్లేస్‌ పై కన్నేసిన ఆ రెండు టీంలు…!

-

ఐపీఎల్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ పోరు కాసేపట్లో జరగనుంది. లీగ్‌లోనే సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తలపడనుంది. రెండు జట్లు కూడా బలంగానే కన్పిస్తున్నప్పటికీ.. ఆట తీరులో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌ చాలా మెరుగ్గా ఉంది.

ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో జట్ల స్థానాలు ఒక్క మ్యాచ్‌తోనే తలకిందులు అవుతున్నాయి. ఏ మ్యాచ్‌ ఓడినా పాయింట్స్‌ టేబుల్‌లోకి కిందకు రావడం ఖాయం. దీంతో ఇక నుంచి ప్రతి టీమ్‌కి ప్రతి మ్యాచ్‌ కీలకమే. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఢీ కొనబోతోంది.

ఢిల్లీ బ్యాటింగ్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పృథ్వీషా, శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌, స్టొయినిస్‌, పంత్‌లతో బ్యాటింగ్‌ భీకరంగా ఉంది. పృథ్వీషా, శిఖర్ ధావన్‌లు ఢిల్లీకి మంచి ఓపెనింగ్‌ స్టార్ట్‌లు అందిస్తున్నారు. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌లు చక్కగా ఇన్నింగ్స్‌ని నిర్మిస్తున్నారు. ఆఖర్లో స్టొయినిస్‌ ఫినిషర్‌ బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఇలా బ్యాటింగ్‌లో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక బౌలింగ్‌లోనూ ఢిల్లీకి తిరుగులేదు. సౌతాఫ్రికా స్పీడ్‌ స్టార్‌ కగిసో రబడా ఢిల్లీ బౌలింగ్‌ ఎటాక్‌కు లీడర్‌. ఈ ఐపీఎల్‌లోనే రబడా టాప్‌ బౌలర్‌.

ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్.. కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో స్టీవ్ స్మిత్, సంజూ శామ్సన్ బాగా ఆడారు. ఆ తర్వాత జోస్‌ బట్లర్ కూడా ఇప్పుడు తన ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. అయితే, మిగతా ఆటగాళ్లు మాత్రం అంతగా రాణించడం లేదు. రాజస్థాన్‌ మిడిలార్డర్‌ చాలా వీక్‌గా ఉంది. మిడిలార్డర్‌ వైఫల్యం వల్లే రాజస్ధాన్‌ ఓటమి పాలవుతోంది. రాజస్థాన్‌ బౌలింగ్‌లో కీ ప్లేయర్‌ జోఫ్రా ఆర్చర్‌. ఈ స్పీడ్‌ స్టార్‌ 145 కి.మీ వేగం తగ్గకుండా బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తిస్తున్నాడు. అయితే జోఫ్రాతో పాటు రాణించే బౌలరే కరువయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news