మిషన్ భగీరథ తప్పుడు స్కీమ్ : మంత్రి శ్రీధర్ బాబు

-

బీఆర్ఎస్ తీసుకువచ్చిన మిషన్ భగీరథ తప్పుడు పథకం అన్నారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఆలోచించి మాట్లాడాలి. మేము కప్పం కడుతున్నాం అనుకుంటే తప్పు. మీ కంటే ముందు ప్రతీ ఊరుకు నీళ్లు తెచ్చింది మేము. 45వేల కోట్లు ఖర్చు చేసినా నీటికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో చెప్పాలి.  2023 జులై, ఆగస్టు, సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోవడం వల్లనే కరువు వచ్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 

ఎండాకాలం నేపథ్యంలో నీటి అవసరాలని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ముఖ్యంగా నీటి సరఫరా చేస్తామని.. 45 వేల కోట్లు ఖర్చు చేశారని, 45 వేల కోట్లు ఖర్చుపెట్టిన కానీ నీరు ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీధర్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news