కరోనా వచ్చిన వారికి 10 వేలు, వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం…!

-

ఒక్కసారి కరోనా సోకింది అంటే అది తగ్గిన తర్వాత నెల రోజుల వరకు ఏ ఒక్క పని చేయడానికి సాధ్యం కాదు. అది ఎవరు అయినా సరే… డబ్బు ఉన్న వాళ్లకు అది పెద్ద సమస్య కాదు గాని డబ్బు లేని వాళ్లకు మాత్రం అది తీవ్ర సమస్య. ఆత్మహత్యలు కూడా జరిగే అవకాశాలు చాలానే ఉంటాయి. దేశ వ్యాప్తంగా కరోనా సోకినా వాళ్ళు ఆర్ధికంగా చితికిపోయి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, చంద్రగిరి నియోజకవర్గ శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఆర్ధికంగా అండగా నిలవాలి అని నిర్ణయానికి వచ్చేశారు. తన నియోజకవర్గ పరిధిలో ఎవరు అయినా సరే కరోనా లక్షణాలతో క్వారంటైన్ కి వెళ్లి వస్తే… రూ. 3వేలు, పాజిటివ్ వ‌చ్చి ఐసోలేష‌న్‌కు వెళ్లొస్తే రూ. 10వేల సాయం అందిస్తాన‌ని ఆయన ప్రకటించారు.

వైద్యం, పోష‌కాహారంతో పాటు కుటుంబ ఖ‌ర్చుల‌కు తోడ్పాటు అందించాల‌నే ఉద్దేశంతో వ్య‌క్తిగ‌తంగా ఈ సహాయం చేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. కాగా చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఆరెంజ్ జోన్ గా ఉంది. ముందు రెడ్ జోన్ అవుతుంది అని భావించినా ప్రభుత్వ చర్యలతో కరోనా పూర్తి స్థాయిలో కట్టడి అయింది జిల్లాలో.

Read more RELATED
Recommended to you

Latest news