పెళ్లి కోసం 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు…!

-

కరోనా నియంత్రణ కు దేశ వ్యాప్తంగా కఠినం గా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. దీనితో పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్లకు మాత్రంచాలా కష్టంగా ఉంది. పెళ్లి కుదిరిన తర్వాత కూడా కరోనా దెబ్బకు ఒంటరి గా ఉండలేక పెళ్లి ఎలా అయినా చేసుకోవాలి అని భావిస్తున్నారు. ఒక యువకుడు తన పెళ్లి కోసం ఏకంగా సుమారు 230 కి.మీ సైకిల్‌పై ప్రయాణించి పెళ్లి చేసుకున్నాడు అతను.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హామీర్‌పూర్‌ జిల్లా పౌథియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి అనే యువకుడికి నాలుగు నెలల క్రితం పెళ్లి కుదిరింది. ఏప్రిల్ 25న వివాహం జరిపించేందుకు గాను పెద్దలు ముహూర్తం పెట్టారు. కాని ఈ సమయంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అయితే లాక్ డౌన్ లో పెళ్లి చేసుకోవడానికి అతను అధికారుల అనుమతి అడిగాడు అయినా సరే అధికారులు అనుమతి ఇవ్వలేదు.

తాను ఒంటరిగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని భావించాడు. లైసెన్స్ లేకపోవడంతో ఎక్కడ ఫైన్ కట్టాలో అని భావించి సుమారు వంద కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళాడు. ముహూర్తం సమయానికి వెలి పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్ది మందితో స్థానికంగా ఉన్న ఒక దేవాలయంలో ఈ వివాహం జరిగింది. మళ్ళీ భార్యతో కలిసి వంద కిలోమీటర్లు సైకిల్ తొక్కి తన సొంత గ్రామానికి వెళ్ళాడు. అమ్మకు అనారోగ్యం ఉందని అందుకే పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news