బీజేపీపై విరుచుకుపడిన ఎమ్మెల్సీ కవిత

-

కేసీఆర్ కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ సీఎంగా ఉండగా , ఆయన కుమారుడు కేటీఆర్ పురపాలక శాఖా మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.. ఇక తన భావ హరీష్ రావు మంత్రిగా ఉండగా, కేసీఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీ గా ఉంది. కాగా తాజాగా ఎమ్మెల్సీ గా ఉన్న కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తూ ఉంది. ఈ పర్యటనలో భాగంగా కవిత చేనేత కళాకారులను కలుసుకుని వారి కష్టనష్టాలను తెలుసుకునే ప్రయత్నంలో… ఆమె గమనించిన విషయం చేనేత బట్టలపై పన్ను వేయడం. ఈ విషయం పై కవిత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ చేనేత రంగానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత సహాయం చేశారన్నది వివరించారు. ఇంకా పరిశ్రమలు మరియయు వ్యవసాయ రంగాల కోసం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నారంటూ కవిత చేనేత కరిమికులకు తెలియచేసింది.

ఇంకా రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయంటే అందుకు కారణం సీఎం కేసీఆర్ పనితీరే అంటూ కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news