నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం… 10 గంటలు నీటిలో దీక్ష !

-

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. ఈ మధ్యనే వైసీపీ అధిష్టానం ఇతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. కానీ కొంతకాలం క్రిందటే కోటంరెడ్డి వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించి.. టీడీపీలోకి వెళుతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. కాగా తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నుండి అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 6వ తేదీ 8 ఉదయం గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కఠినమైన జల దీక్ష చేయనున్నాడు. నెల్లూరు జిల్లాలోని రూరల్ ఏరియా పొట్టేపాలెం కలుజు వద్ద పారుతున్న నీటిలో కూర్చుని ఈ దీక్షను చేయబోతున్నాడు.

ఇక ఈ సమయంలో మిగిలిన వారెవ్వరూ అక్కడ లేకుండా ఉండడానికి తాను ఒక్కడే నీటిలో కూర్చుని ఉంటాడు. ఈ విషయం తెలిసిన కోటంరెడ్డి సన్నిహితులు మరియు నీటిలో అన్ని గంటల పాటు ఆరోగ్యం బాగాలేని మీరు చేయడం కష్టం కదా ,, ఎందుకు రిస్క్ అని చెప్పినా ఈయన వినకుండా ఈదీక్షను తలపెట్టారట.

Read more RELATED
Recommended to you

Latest news