వరద బాధితులకు ఇచ్చే పరిహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పదివేల రూపాయల ఆర్ధికసాయాన్ని అనర్హులకు ఇచ్చారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అడ్వాన్స్‌గా పరిహారాన్ని అందించారన్నారాయన. ఎంఐఎం, టీఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్ వాతావరణాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు రాజాసింగ్.
మరో వైపు వరదలతో నష్టపోయిన బాధితులు మాత్రం తక్షణ సాయం నిలిపివేతపై భగ్గుమంటున్నారు. రూ.10వేల సాయం ఎందుకు ఇవ్వరని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గ్రేటర్‌లోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఇండ్లు, కార్యాలయాల తోపాటు జీహెచ్‌ఎంసీ జోనల్, సర్కిల్, వార్డు కార్యాలయాల వద్ద ధర్నా చేశారు.