ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలి : సీతక్క

-

తొమ్మిదేళ్లుగా పరిపాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ర్ట ప్రజలందరికీ అన్యాయం చేసిందన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేజీ టు పీజీ విద్య ఎక్కడ పోయిందన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గ్రౌండ్ లో ఆగస్టు 26వ తేదీన నిర్వహించబోయే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు.

Seethakka's gaffe sparks cross-voting controversy

మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం, కలెక్టర్ తో మాట్లాడి మండలంలోని 25 గ్రామపంచాయతీలో ఉన్న ప్రభుత్వ స్థలాలు కేటాయించేలా చొరవ తీసుకుంటానని ములుగు ఎమ్మెల్యే సీతక్క భరోసా ఇచ్చారు. సోమవారం మండలంలో పర్యటించిన సీతక్క రాత్రి మండల వర్కింగ్ జర్నలిస్టులతో సమావేశమై మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రైవేటు పాఠశాలల్లో వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్థానని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక వారిని మర్చిపోవడం దారుణమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news