Breaking : గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ..

-

గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఏమాత్రం సఖ్యత లేదన్న విషయం తెలుస్తుంది. బాహాటంగా విమర్శలు గుప్పించుకునే స్థాయికి ఈ విభేదాలు ముదిరాయి. ఈ నేపథ్యంలో, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది.

After cold war, Telangana CM KCR shares dais with Governor Tamilisai

గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం గవర్నర్‌తో భేటీ అయ్యారు సీఎం. రాజ్‌భవన్‌లో పెండింగ్‌ బిల్లులపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంపై కూడా గవర్నర్‌, సీఎం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య గ్యాప్ కనిపిస్తుండగా.. తాజా భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news