సచివాలయం బీఆర్ఎస్ నేతలకేనా : సీతక్క

-

నియోజకవర్గ పనుల కోసం తాను సచివాలయానికి వెళ్తుంటే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయం ప్రధాన ద్వారం ముందు సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు.

Seethakka: ప్రభుత్వం అందుకే దళిత బంధు తెచ్చింది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు - Telugu News | Mulugu MLA Seethakka Hot comments on KCR Government in Gandhi ...

సెక్రటేరియట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చూపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సచివాలయం లోపలికి ఎందుకు అనుమతించడం లేదు. ఇది చాలా అవమానం. నేను రచ్చ చేయాలి అనుకుంటే చేయగలను.. కానీ ప్రజా సమస్యలపై ఇక్కడకు వచ్చాను. సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు రాడు… వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారు. అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు. సెక్రటేరియట్ కేవలం బీఆర్ఎస్ నేతలకేనా.. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండి. హోంమంత్రిగా ఉండి గన్‌మెన్లను కొట్టడం ఏంటి. ఈ విషయంపై పోలీసులకు పౌరుషం రావాలి. హోంమంత్రి వెంటనే సంబంధిత గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలి’’ అని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news