మరో వివాదంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి చిక్కుకున్నారు. శ్రీదేవి తుళ్ళూరు లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం లో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రామానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఇంత మంది పాల్గొన్నడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని కోసం పోరాడే రైతులను కరోనా నిబంధనలు పేరుతో పోలీసులు వేదిస్తోంటే వైసిపి మీటింగ్ లకు కరోనా నిబంధనలు వర్తించవా అంటూ రైతులు ఎమ్మెల్యేని నిలదీసినట్టు తెలుస్తోంది. దీంతో అలా నిలదీసిన రైతులని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
పోలీసులు తీరుపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్ననే ఆమె తన వద్ద తీసుకున్న డబ్బు ఇవ్వడం లేదని, తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలంటూ వైసీపీ నేత, జీడీసీఎంఎస్ డైరెక్టర్ మేకల రవి కుమార్ సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు తన వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకుని, డబ్బు విషయంలో తన భర్త మోసం చేశాడని చెప్పి తన వద్ద ఉండవల్లి శ్రీదేవి రూ. 1.40 కోట్లు తీసుకున్నారని మేకల రవి తెలిపారు. అప్పుడప్పుడు కొంత మొత్తంతో రూ.60 లక్షలు తిరిగి ఇచ్చారని, మిగిలిన రూ. 80 లక్షలు అడిగితే బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.