పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు.. తనని నమ్మిన ప్రజాకోసం కిలోమీటర్లు నడిచాడు, సంచులు మోశాడు, గొడ్డుకారం తిన్నాడు..! వివరాల్లోకి వెళితే… తెలంగాణ రాష్ట్రంలోని పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన గిరిజనుల ఆకలి తీర్చేందుకు కంకణం కట్టుకున్నాడు ఇందుకోసం ఆయన బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న బుట్టాయగూడెం మండలంలోని దట్టమైన అడవుల్లో ఉన్న మోతుగూడెం ను ఎంచుకున్నాడు, అక్కడ దాదాపుగా 150 కుటుంబాలు ఉంటున్నాయి. వారికి నిత్యవసర సరుకులు ఇచ్చేందుకు బాలరాజు కఠినమైన సవాళ్లని ఎదురుకున్నాడు.
వాగులు వంకలు దాటాడు, కొండలు గుట్టలు ఎక్కాడు కిలోమీటర్లు తన భుజాలపై నిత్యవసర సామాను ఉండే సంచులను మోస్తూ మోతుగూడాన్ని చేరుకున్నాడు. అక్కడి కుటుంబాలకు ఆ సరకులు అప్పజెప్పాడు అలా బాల రాజు ఇప్పటివరకు 75 లక్షల విలువైన నిత్యావసరాలను వారికి అందించాడు. తాజాగా ఆయన ఆ ప్రాంతానికి చేరేసరికి మధ్యన్నమైంది ఇక అక్కడి గోగుల కమలమ్మ అనే కొండరెడ్డి గిరిజన మహిళ ఇంటికి చేరుకున్నారు. ఆమె తన ఇంట్లో ఉన్న గొడ్డుకారంతో ఎమ్మెల్యే బాలరాజు కు తనతో ఉన్న అధికారులకు భోజనం పెట్టింది. బాలరాజు ఎంతో సంతోషంగా ఆ గొడ్డుకారాన్ని తిన్నాడు.