మేజర్ లీగ్ క్రికెట్ 2023: ఆండ్రే రస్సెల్ పోరాడినా నైట్ రైడర్స్ కు తప్పని ఓటమి… !

-

అమెరికాలో రెండు వేదికలలో ఈ రోజు నుండి ప్రారంభం అయిన మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 1 లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ మరియు లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో ఫాఫ్ డుప్లిసిస్ సేన 69 పరుగుల తేడాతో సునీల్ నరైన్ జట్టును ఓడించి ఘనంగా ఈ లీగ్ ను ప్రారంభించింది. మొత్తం ఆ ఋ జట్లు పోటీ పడుతున్న ఈ లీగ్ లో ఒక్కో జట్టు అయిదు మ్యాచ్ లు ఆడనుంది. కాగా మొదటగా టాస్ గెలిచిన నైట్ రైడర్స్ టీం కెప్టెన్ నరైన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సూపర్ కింగ్స్ కు మొదటి ఓవర్ లోనే డుప్లిసిస్ రూపంలో వికెట్ కోల్పోయినా… మిగిలిన ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడి జట్టు స్కోర్ ను 181 పరుగులకు చేర్చారు. ఈ క్రమంలో ఓపెనర్ కాన్ వే 55 పరుగులు చేయగా, మిల్లర్ 61 పరుగులు చేశాడు. ఆఖర్లో బ్రేవో కూడా బ్యాట్ జులిపించాడు. సూపర్ కింగ్స్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో నైట్ రైడర్స్ అట్టర్ ప్లాప్ అయింది. రస్సెల్ మినహా ఎవ్వరూ రాణించలేక టీం కు ఓటమిని కొనితెచ్చారు. రస్సెల్ (55) ఒక్కడే కొంచెం సేపు టీం ను గెలిపించడానికి కృషి చేశాడు.

సూపర్ కింగ్స్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి నైట్ రైడర్స్ ఆటగాళ్లను కట్టడి చేశారు. స్పిన్నర్ మహమ్మద్ మొహసిన్ వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీనితో మొదటి విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news