జులై 17న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

-

నరేంద్ర మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయ్.పదే పదే సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ కి కేంద్రంలో ఎలా చెక్ పెట్టాలి అనే అంశంపై చర్చించి కార్యాచరణ రూపొందించుకున్నాయి. ఇదంతా గమనిస్తున్న బీజేపీ కూడా ప్రతిపక్షాల కూటమికి ధీటుగా ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తన బలాన్ని ప్రతిపక్షాలకు చూపించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో జులై 18న ఎన్డీఏ మరోసారి తన మిత్రపక్షాలతో ఢిల్లీలో సమావేశం కానుంది.

తెలుగుదేశం పార్టీ, హిందుస్థానీ అవామ్ మోర్చా, లోక్ జనశక్తి (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ జనతా దళ్, వికాశీల్ ఇన్సాన్ పార్టీ వంటి కొత్త మిత్రపక్షాలు వర్షాకాల సమావేశానికి రెండు రోజుల ముందు ఈ సమావేశానికి హాజరవుతాయి. చిరాగ్ పాశ్వాన్, చంద్రబాబు నాయుడు, జితన్‌రామ్ మాంఝీ మళ్లీ ఎన్డీయేలో కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

నిజానికి రానున్న ఎన్నికల్లో విపక్షాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్డీయే తన పాత మిత్రపక్షాలను మళ్లీ ఏకం చేసింది. వాటిలో బీహార్-యుపికి చెందిన చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. అదే సమయంలో శివసేన, ఎన్సీపీ విడిపోయిన తర్వాత కొత్త వర్గం ఎన్డీయేలో చేరడంతో కూటమి పరిధి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరోసారి కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు బీజేపీ కసరత్తు చేస్తోంది.

తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలోని తన మిత్ర పక్షాలకు చెందిన వ్యక్తులకు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ప్రధాని మోదీ ఇప్పటికే చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త మంత్రులను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కేంద్ర మంత్రి మండలితో పాటు యూపీలో కూడా మంత్రివర్గ విస్తరణ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో బీజేపీ పాత మిత్రుడు సుభాష్పాకు చెందిన ఓపీ రాజ్‌భర్, దారాసింగ్ చౌహాన్‌లు మంత్రులు అవుతారని భావిస్తున్నారు.బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాల సమావేశం బెంగళూరులో జూలై 17, 18 తేదీల్లో జరగనుంది. ప్రతిపక్ష పార్టీల సమావేశం చివరి రోజున ఎన్డీయే తన మిత్రపక్షాలతో సమావేశం కానుంది.దీని ద్వారా విపక్షాలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు తన వైఖరి ఏంటో క్లారిటీ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news