తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎల్లుండి ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 17న కౌంటింగ్ అదే రోజు ఫలితాల వెల్లడి ఉండనుంది.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 93 మంది ఉన్నారు. ఇక 531268 మంది ఓటర్లు ఉండగా, 799 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 71 మంది ఉన్నారు. అక్కడ 505565 మంది ఓటర్లు ఉండగా 731 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఏపీ విషయానికి వస్తే అదే తేదీన ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గుంటూరు-కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news