ఇప్పటి నుంచే మిలటరీ స్కూల్స్ లో అమ్మాయి క్యాడెట్లు కి కూడా అడ్మిషన్ దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి 10, 2021-22 ఎకాడమిక్ ఇయర్ కి మిలటరీ స్కూల్స్ లో గర్ల్స్ క్యాడెట్లు కి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. అయితే గతం లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్ 2018-19 సైనిక్ స్కూల్లో జరిగిన బాలికల పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యాయని అన్నారు. అయితే ఈ కొత్త అకాడమిక్ ఇయర్ 2021-22 బాలికలు కూడా అడ్మిషన్ ఇవ్వనున్నారు. అయితే ఇప్పటి వరకు 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో కేవలం బాలురకు మాత్రమే అడ్మిషన్ ఇచ్చేవారు. ఈ పాఠశాలను సైనిక్ స్కూల్ సొసైటీ వాళ్ళు నడిపిస్తున్నారు. ఏది ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అఫ్ ది మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ ఆధ్వర్యం లో ఉంటాయి.
సైనిక్ స్కూల్స్ ని అసలు ప్రారంభించడానికి గల కారణం ఏమిటంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ కి విద్యార్థుల ని పరిచయం చేయాలని. అది కూడా తక్కువ వయసు లోనే చేయాలని దీని ఉద్దేశ్యం. కేంద్ర ప్రభుత్వం పక్షాన జవహర్ నవోదయ స్కూల్స్ ఉన్నాయి మరియు భూపాల్ లో కూడా వుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో పరీక్ష రాయవచ్చు.