ఎమ్మెల్సీ నామిమేషన్ల అనంతరం టీడీపీ పై ఎమ్మెల్సీ అభ్యర్దులు విరుచుపడ్డారు. ఈ క్రమంలో బాలయ్యపై ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. నేను అడగకుండానే మొదటి సారి, రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందని, అదే టీడీపీలో పదవులు దక్కించుకోవాలంటే పైరవీలు, ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ముస్లింలు ఓటేయలేదని మంత్రి పదవులివ్వని చరిత్ర టీడీపీదని ఆయన అన్నారు. బాలయ్య ఏ విధంగానూ ప్రభావితం చేయలేరని ఆయన అన్నారు.
బాలయ్య లెజెండ్, రూలర్ అనుకుంటూ ఉంటారని, ప్రస్తుతం బాలకృష్ణ బీ-3 సినిమాలో బిజీగా ఉన్నారని అన్నారు. తన దర్శకుడెవరు.. హీరోయిన్ ఎవరనే దాని పైనే బాలయ్య ఆలోచనలు ఉంటాయని తన కాల్షీట్లు వచ్చే నాలుగేళ్లల్లో ఎలా ఉండాలి.. తన కొడుకు సినీ జీవితం ఎలా ఉండాలనే ప్రణాళికే బాలయ్య వద్ద ఉందని అన్నారు. ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలోననే ప్రణాళిక బాలకృష్ణ వద్ద లేదని సోడా కొట్టేవాళ్ళు వేయి కోట్లు సంపాదించిన నేతలు హిందూపురం టీడీపీలో ఉన్నారని అన్నారు. బాలయ్యవన్నీ చెత్త కామెంట్లని, హిందూపురాన్ని బాలకృష్ణ తన పీఏలకు వదిలేశారని అన్నారు.