వైసీపీ కి ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి రాజీనామా..!

-

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గామాలపాడులో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీకి విధేయుడుగా పని చేశానని.. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు కూడా త్యాగం చేశానని తెలిపారు.

కానీ ఈరోజు గురజాల నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పార్టీ నాది అన్నట్టు ప్రవర్తిస్తున్న తీరుతో నన్ను నమ్ముకున్న ఏ ఒక్క Bc, St, SC సోదరులకు స్థానిక ఎమ్మెల్యే తీరుతో న్యాయం చేయలేకపోయానని అన్నారు. ఇదే విషయంపై పార్టీ పెద్దలకి విన్నవించుకున్నా కానీ ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఈరోజు పార్టీని వీడుతున్నానని పార్టీని వీడడం ఎంతో బాధాకరంగా కూడా ఉందని అన్నారు. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం భవిష్యత్ కార్యచరణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news