తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు. వాటిని ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ చీఫ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
భయాందోళనలతో కేసీఆర్ పొలం బాట పట్టారని విమర్శించారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు.