విజయ్‌నాయర్‌ను కవిత 2021 మార్చి 19, 20 తేదీల్లో కలిశారని.. మద్యం విధానంలో ఎలా మార్పు చేస్తామనే విషయాలను కవితకు విజయ్‌నాయర్ వివరించారని బుచ్చిబాబు తెలిపారని ఈడీ వివరించింది. కేజ్రీవాల్,సిసోదియా తరపున విజయ్‌నాయర్ మద్యం విధానంపై పని చేశారని చెప్పారని తెలిపింది. మద్యం విధానంలో కవితకు అనుకూలమైన మార్పులు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఇచ్చేలా అవగాహన కుదిరిందని రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
మాగుంట రాఘవకు 32.5 శాతం, కవితకు 32.5 శాతం, సమీర్ మహేంద్రుకు 35 శాతం ఇండో స్పిరిట్స్‌లో వాటా కుదిరిందని బుచ్చిబాబు చెప్పారని ఈడీ తెలిపింది. మద్యం విధానం అధికారికంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే బుచ్చిబాబు చేతిలోకి వచ్చిందని వివరించింది. మద్యం విధానంలో కొన్ని భాగాలను బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో గుర్తించినట్లు ఈడీ స్పష్టం చేసింది.