నా బిడ్డ కవితను అరెస్టు చేస్తారట.. చేయనివ్వండి: సీఎం కేసీఆర్‌

-

బీజేపీ అనైతిక పాలనకు ఎదురుతిరిగిన వారందరినీ దర్యాప్తు సంస్థల పేరుతో భయపెడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలను బీజేపీ ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆరోపించారు.

మొన్న మంత్రి మల్లారెడ్డి.. తర్వాత గంగుల కమలాకర్.. ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర.. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత.. ఇలా బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఏం జరుగుతుందో చూద్దాం.. ఏం చేస్తారో చేసుకోనిద్దాం అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

“కవితను అరెస్టు చేస్తారట.. చేయనివ్వండి. ఏం చేస్తారో చూద్దాం.. భయపడే ప్రసక్తే లేదు. మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకు వచ్చారు. నోటీసుల పేరుతో పార్టీ నేతలందరినీ వేధిస్తున్నారు. కేంద్రంపై మా పోరాటం కొనసాగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం. 99 శాతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తాం. శాసనసభ్యులు తప్పులు చేయొద్దు. తప్పు చేసిన వారికి టికెట్లు దక్కవు.”-కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి

Read more RELATED
Recommended to you

Latest news