కేసీఆర్ స్పీడ్‌ను కాంగ్రెస్ నాయ‌కులు అందుకోలేక‌పోతున్నారు: కవిత

-

కాంగ్రెస్ అంటే అవినీతి.. ఆ పార్టీని దేశం రిజెక్ట్ చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె..కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలో క్రియేటివిటి..కమిట్‌మెంట్ లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పథకాలను కాపీ కొడుతూ డిక్లరేషన్‌లు ప్రకటిస్తున్నారని కవిత అన్నారు. రాహుల్‌గాంధీ అవుట్‌ డేటెడ్‌ నాయకుడయ్యారని..కేసీఆర్ స్పిడ్‌ను అందుకోలేకపోతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.

K Kavitha, KCR's daughter, to appear before ED on March 11 - India Today

కాంగ్రెస్ నాయ‌కులు ఆలోచ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని క‌విత ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. దేశంలో కాంగ్రెస్ పార్టీని తిర‌స్క‌రిస్తున్నారు. అలాంటి పార్టీని జ‌గిత్యాల‌లోనూ ఓడించాలి. తెలంగాణ‌లో ఊహ‌కంద‌ని అభివృద్ధి జ‌రుగుతుంది. దీంతో ప్ర‌తిప‌క్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాంగ్రెస్ నేత‌ల మాట‌లు విని మోసపోవ‌ద్దు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గులాబీ పార్టీ శ్రీరామ‌ర‌క్ష‌. కేసీఆర్ ప‌థ‌కాల‌ను దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని డిమాండ్ ఉంది. కాబ‌ట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. తెలంగాణ అంటే ఒక‌నాడు విషాద‌గాథ‌… ఇప్పుడు తెలంగాణ అంటే విజ‌య‌గాథ అని క‌విత పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news