ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు ముగిశాయి. మరికాసేపట్లో కల్వకుంట్ల కవిత ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ప్రవేశపెట్టనుంది. కవితను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనుంది. మరోవైపు తన అరెస్టును కవిత సవాల్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
కాగా,నిన్న ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని ఆ పార్టీ నేత హరీశ్ రావు న ప్రకటించారు.