రాష్ట్రానికి ఒక్కటైనా అలాంటి కాలేజీ కావాలి. మాతృభాషపై ప్రసంగంలో ప్రధాని మోదీ.

-

మాతృభాషలో విద్య గురించి చాలా రోజులుగా పెద్ద పెద్ద చర్చలే జరుగుతున్నాయి. మాతృభాషలో విద్య నేర్చుకుంటే చాలా ఈజీగా ఉండడంతో పాటు పిల్లలకి సౌకర్యంగా ఉంటుందని, మాట్లాడే భాషలోనే విద్య బాగుంటుందని, చాలా దేశాల్లో అలాగే జరుగుతుందని, అందుకే ఆ దేశాలు అంత అభివృద్ధి చెందాయని నిపుణులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానంలోనూ ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలోనే ఉండాలని తెలిపింది.

తాజాగా మాతృభాష అంశం మీద ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతీ రాష్ట్రంలో విద్య మాతృభాషలోనే జరగాలని, సాంకేతిక విద్య కూడా మాతృభాషలో అందించే కాలేజీలు ఉండాలని, రాష్ట్రంలో ఒక్క కాలేజీ అయినా విద్యని పూర్తిగా, మాతృభాషలోనే నిర్వహించేలా ఉండాలని, అలాంటి కాలేజీలని రూపొందిస్తామని అన్నారు. ఇతర భాషల్లో విద్య నేర్చుకోవడం అనేది, పిల్లలపై తీవ్ర ఒత్తిడికి కారణమవుతుందని చాలా మంది అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news