ట్రైలర్ మామూలుగా ఉన్న సినిమా బాగుంటుందని చెప్పడానికి కారణాలేంటో..?

Join Our Community
follow manalokam on social media

లాక్డౌన్ తర్వాత తెలుగులో సినిమాలకి మంచి స్పందనే వచ్చింది. కానీ సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా గురించి విపరీతమైన చర్చ జరుగుతుండడం మాత్రం అది ఉప్పెన విషయంలోనే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా గురించి అటు ఇండస్ట్రీలోనూ, ఇటు సినిమా అభిమానుల్లోనూ విపరీతమైన చర్చ నడుస్తుంది. ఇంతలా చర్చ జరగడానికి కారణం ఏంటా అన్న అంశం కూడా చర్చల్లోకి వచ్చింది. ఐతే ట్రైలర్ నార్మల్ గా ఉన్నప్పటికీ సినిమాలో కొత్త అంశమేదో ఉన్నట్టు తోస్తుంది.

బాగా డబ్బు గల అమ్మాయిని అస్సలు డబ్బులేని వాడు ప్రేమించడం అనే కాన్సెప్ట్ చాలా పాతదే. కానీ ఉప్పెన సినిమాలో దానికి మించి మరోటి ఏదో ఉంది. అదేంటనేది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. అదీగాక విజయ్ సేతుపతి, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ వంటి వాటివల్ల కూడా సినిమాకి బాగా బజ్ ఏర్పడింది. మరి ఇంత బజ్ క్రియేట్ చేస్తున్న ఉప్పెన సినిమాకి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఫిబ్రవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

TOP STORIES

నమ్మండి.. ఈ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదు

పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్‌ కవర్లను చూశారా? ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదా! అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమేనండి. మనం వాడి పడేసిన కవర్లు...