ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన వస్త్రధారణకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో తెలిసిందే. కార్యక్రమానికి తగ్గట్టుగా మోదీ వస్త్రధారణ ఉంటుంది. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ రాజ్యసభకు వచ్చారు మోదీ. ఈ సభలో మోదీ లైట్ బ్లూ కలర్ జాకెట్ ధరించి ఉన్నారు. అయితే ఎప్పుడూ కనిపించే వస్త్రధారణలోనే వచ్చినా.. ఇవాళ మోదీ ధరించిన జాకెట్ కు ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే..?
ఇవాళ రాజ్యసభకు మోదీ ధరించిన జాకెట్ ను ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి తయారు చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్ 2023’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ సోమవారం పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ప్రధానికి అరుదైన కానుకను అందజేసింది.
పెట్ (పాలీఇథలిన్ టెరెఫ్తలేట్) బాటిళ్లను రీసైకిల్ చేసి తయారు చేసిన నీలం రంగు జాకెట్‌ను మోదీకి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ జాకెట్‌నే ప్రధాని ధరించి బుధవారం పార్లమెంట్‌కు వచ్చారు. ‘బ్లూ జాకెట్’తో హరిత సందేశమిచ్చారు. ‘హరిత వృద్ధి’ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మోదీ సర్కారు.. ఇటీవలే రూ.19,700 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించింది.