Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

-

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంయుక్త సందడి చేసింది.

సార్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు సంయుక్త రెడ్ శారీలో సంప్రదాయ బద్ధంగా వచ్చింది. శారీలో కూడా సంయుక్త చాలా హాట్ గా కనిపించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

సంయుక్త మేనన్ కల్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పటాస్ తర్వాత కల్యాణ్ రామ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

బింబిసార సినిమాలో సంయుక్త పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. అయినా కనిపించిన కాసేపు ఈ భామ తన అందం, నటనతో ఆకట్టుకుంది. బింబిసార తర్వాత ఈ భామకు సరైన అవకాశాలు రాలేదు. తాజాగా ధనుష్ తో సార్ లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 17 రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news