అందని ఆహ్వానం…ప్రధానికి అవమానం..

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పలేని అవమానం జరిగిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే కుమారుడి వివాహానికి ప్రధానికి ఆహ్వానం అందలేదు. ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి మాత్రం ఇంతవరకు వివాహ ఆహ్వానం అందకపోవడం గమనార్హం. రాజ్ థాకరే కుమారుడు అమిత్‌, ప్రముఖ ఫిజీషియన్‌ డాక్టర్‌ సంజయ్‌ బోరుడె కుమార్తె మిథాలి వివాహం జనవరి 27న లోవర్‌ పరేల్‌లోని సెయింట్‌ రెగిస్‌ హోటల్‌లో జరగనుంది. దీంతో గత కొద్దికాలంగా మోడీపై విమర్శలు చేస్తున్న థాకరే తన కుమారుడి విహహానికి మోడీని ఆహ్వానించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అనివార్య కారణాల వల్ల థాకరే ఢిల్లీకి వెళ్లే కార్యక్రమం ఆగిపోవడంతో వివాహ ఆహ్వానాలు పొందినవారిలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, ప్రకాశ్‌ జావడేకర్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, మేనకా గాంధీ, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు ఉన్నారు. ఎన్సీపీ నేత శరత్ పవార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఆహ్వానం అందుకున్నారు. అయితే మోదీకి మాత్రం ఇంతవరకు ఆహ్వానం అందలేదు.
ఎందరో ప్రముఖులకు అందిన ఆహ్వానం ప్రధానికి అందక పోవడంతో దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చకొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news