వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళపై సోషల్‌మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిళ మీడియాతో మాట్లాడుతూ… ప్రభాస్ అనే వ్యక్తిని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని, కలవలేదని తెలిపారు. దీంతో సినీ హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. షర్మిళ వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు ఉన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిళ తెలిపారు. వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పిచ్చి రాతలు, కూతలు కూసేవారిని కఠినంగా శిక్షించాలన్నారు. దీని కోసం ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ నేతలు, విలేకరులు, మహిళా సంఘాలను కోరుతున్నాను’ ‘తప్పుడు ప్రచారాలు చేసేవారు, చేయించేవారు కాకుండా నేను దోషిలా నిలబడి నా వాదన వినిపించుకోవాల్సి రావడం మహిళలకే అవమానకరం అన్నారు.’
తనపై జరుగుతున్న అసత్య ప్రచారం నా కుటుంబంతో పాటు స్నేహితులు, సన్నిహితులను ఎంతగానో బాధిస్తోందన్నారు. ఇలాంటి పుకార్లను పుట్టించేవారికి సిగ్గు అనిపించడం లేదా?. ‘ఈ ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.’ నాడు వైఎస్ సీఎం కాకముందు ఫ్యాక్షనిస్టు అంటూ ప్రచారం చేశారు. కానీ ఆయన సీఎం అయ్యాక ఆయన ఎలాంటి వాడు అనే విషయం ప్రజలకు తెలిసింది. అదే స్థాయిలో ఈ సారి తనను, తన అన్న జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ…ఆవేదన వ్యక్తం చేశారు.