ఈ కరోనా మహమ్మారి వల్ల చాల మందికి ఆర్ధిక ఇబ్బంది తప్పలేదు . చాల మంది ఉద్యోగం ,ఉపాధి అవకాశాలు కోల్పోయారు . దీంతో వాళ్ళు తమ సొంత గ్రామాలకు వలస వెళ్లిపోయారు .కరోనా వైరస్ లొక్డౌన్ కష్టకాలం లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మైనస్ లోకి వెళ్లిపోయాయి . ఓ పక్క పన్నులు రాకా ,మరో పక్క సంక్షేమ పథకాలకు నగదు లేక అప్పు ముట్టని పరిస్థితుల్లో చాల రాష్ట్రాలు కొట్టు మిట్టాడుతున్నాయి .కోరోనా వైరస్ లొక్డౌన్ కష్టకాలం లో ఏపీ లోని జగన్ సర్కార్ కి కూడా చాల ఇబ్బందులు వచ్చాయి .అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్త చెప్పింది ఏపీ సీఎం జగన్మోహన్ సర్కార్ కి .
అదనపు రుణాలు తీసుకునేందుకు గాను ఏపీ ప్రభుత్వం కి పచ్చ జెండా ఊపింది . అదనపు రుణాలు తీసుకునేందుకు మొత్తం 5 రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది .అందులో ఆంధ్ర ప్రదేశ్ వుంది . ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ సహా మొత్తం ఐదు రాష్ట్రాలు చేపట్టిన సంక్షేమ పథకాలు ,సంస్కరణల వల్ల అధిక ఋణం తీసుకుందుకు కేంద్ర ఆర్ధిక శాఖ తాజాగా అనుమతి ఇచ్చింది . ఇక ఆంధ్ర ప్రదేశ్ కు 2 వేలఐదువందల 25 కోట్లు , తెలంగాణకు 2,508 కోట్లు అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం ఈ రాష్ట్రాలకు వెసలుబాటు ఇచ్చింది . అయితే సులభ తర వాణిజ్య సంస్కరణలు చేసేందుకు కేంద్రం ఈ వేశాలు బాటు కల్పించింది .రెండు ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ,తమిళనాడు ,మధ్య ప్రదేశ్ ,రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అదనపు రుణాలు పొందేందుకు అవకాశం కల్పించింది .
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో మొత్తం ఐదు రాష్ట్రాలకు కలిపి 16 ,728 కోట్ల అప్పుతీసుకొనే వీలు వుంది . ఇక కేంద్రం అమలు చేస్తుంది ఒకే దేశం ఒకే రేషన్ పథకాన్ని . పట్టాన స్థానిక సంస్థలు , విద్యుత్ రంగ సంస్కరణలు అమలు చేసినందుకు ఆయా రాష్ట్రాలకు ఈ అదనపు రుణాలు తీసుకోటానికి అవకాశం కల్పించింది కేంద్రం . ఇవన్నీ రాష్ట్రాలు కూడా వీటి విషయం లో ముందుకు సాగుతున్నాయి . కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణల విషయం లో కూడా ముందుకు సాగుతున్నాయి ఈ రాష్ట్రాలు . ఏపీ ప్రభుత్వానికి 2525 కోట్ల ఋణం తీసుకొనే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం .